టీమిండిమా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ గా జడేజా రికార్డు నెలకొల్పాడు. జడేజా కంటే ముందు భారత లెజండరి క్రికెటర్ కపిల్ దేవ్ ఈ అరుదైన ఘనత సాధించారు. నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆదిల్ రషీద్ వికెట్ తీసి.. జడేజా ఈ ఘనత సాధించారు. జడేజా 6641 పరుగులు చేయగా, కపిల్ 9031 పరుగులు చేశాడు. మొత్తం మీద, కపిల్, వసీం అక్రమ్, షకీబ్ అల్ హసన్, డేనియల్ వెట్టోరి, షాన్ పొల్లాక్ తర్వాత ఈ ప్రత్యేకమైన ఘనత సాధించిన ఆరవ క్రికెటర్ జడేజా.
అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన ఐదవ భారత బౌలర్ గా రవీంద్ర జడేజా నిలిచాడు. అతని కంటే ముందు అన్ని ఫార్మాట్లలో కలిపి 600 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఇతర భారతీయ క్రికెటర్లు అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) ఉన్నారు.
మరోవైపు ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ జడేజా రికార్డు సాధించారు. ఇప్పటివరకు ఆయన 41 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జేమ్స్ అండర్సన్(40)ను జడ్డూ అధిగమించాడు.
మొత్తం మీద, జడేజా టెస్ట్‌లలో 323 వికెట్లు, వన్డేలలో 223 వికెట్లు మరియు టీ20లలో 54 వికెట్లు తీసుకున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు టీ20ల నుండి జడేజా రిటైర్ అయ్యాడు.