Wednesday, January 22, 2025

ఎద్దుల బండిపై జడేజా ‘వింటేజ్ రైడ్’.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్‌కు తిరిగొచ్చాడు. రవీంద్ర జడేజా గుర్రపు స్వారీ చేయడం మీరు తరచుగా చూసి ఉంటారు. కానీ జడేజా తాజాగా ఎద్దుల బండి నడుపుతూ కనిపించాడు. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవీంద్ర జడేజా ఎద్దుల బండి నడుపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియో క్యాప్షన్‌లో జడేజా ‘వింటేజ్ రైడ్’ అని రాశారు.

ఈ వీడియో చూసిన అభిమానులు, మాజీ క్రికెట‌ర్లు జడేజాను అభినందిస్తూ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 2023లో ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన జ‌డ్డూ ఐసిసి ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డుకు నామినేట్ అయిన ముచ్చట తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, ప్యాట్ క‌మిన్స్ కూడా ఈ రేసులో ఉన్నారు. రవీంద్ర జడేజా పోస్టు చేసిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News