Tuesday, January 21, 2025

ఘనంగా జగదాంబిక గోల్కొండ ఎల్లమ్మ బోనాల మహోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీ జగదాంబిక గోల్కొండ ఎల్లమ్మ బోనాల మహోత్సవం గంగపుత్ర సంఘం సబ్జి మండి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆదివారం న్యూ గంగానగర్‌లోని కనకదుర్గ దేవాలయం నుండి భారీ తొట్టెలను సబ్జి మండి మహంకాళి దేవాలయంకు చేరుకుని పోతరాజుల విన్యాసాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఎల్లమ్మ దేవాలయంకు చేరుకుని అమ్మవారి తొట్టెలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అనందేశి విజయ్ కిశోర్ , ప్రధాన కార్యదర్శి, అంబటి విజయ్ ఆనంద్ , గోల్కొండ పూజా కమిటీ అధ్యక్షుడు అల్లె వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి గుడుమని చంద్ర కాంత్, ముషీరాబాద్ ఎమ్మెల్యే, ముఠా గోపాల్ , చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్, సామాజిక కార్యకర్త చికోటీ ప్రవీణ్, నల్లపోచమ్మ మహంకాళి దేవాలయం కమిటీ సభ్యులు ,గంగపుత్ర సంఘం పదాదికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News