Friday, December 20, 2024

మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

minister jagadish reddy speech in Munugode

మునుగోడు: కాంగ్రెస్, టిడిపి పాలనలో అభివృద్ధికి మునుగోడు అమడ దూరంలో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం మంత్రి జగదీష్ రెడ్డి రోడ్‌షో చేపట్టారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడులో గెలిచి అభివృద్ధి చేశారని ప్రశంసించారు. 60 ఏళ్ల ఫ్లోరైడ్ భూతాన్ని సిఎం కెసిఆర్ పారద్రోలిండ్రని మెచ్చుకున్నారు. మన ప్రాజెక్టులకు బిజెపి అడ్డుపడుతోందని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్ గెలిస్తే కరువును శాశ్వతంగా పారద్రోలుతామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటం అని జగదీష్ రెడ్డి అభివర్ణించారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపు ఉండి నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News