- Advertisement -
సూర్యాపేట: నీటి పంచాయతీకి ఎపి ప్రభుత్వ వైఖరే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా నీటి వాటా పంచాయతీపై జగదీష్ రెడ్డి మాట్లాడారు. ముందుగా ఎపి ప్రభుత్వం జిఒ నెం.203ను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ స్నేహ హస్తాన్ని ఎపి అందుకోవడంలేదని విమర్శించారు. అటు కేంద్రానికి ఇటు సుప్రీంకోర్టుకు ఎపి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులు అన్ని సక్రమమేనని, నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీం కోర్టును అడుగుతున్నామన్నారు. ఎపి ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
- Advertisement -