Friday, January 24, 2025

మతం పేరుతో బిజెపి రాజకీయం చేస్తోంది: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

భువనగిరి: మతం పేరుతో బిజెపి రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు భువనగిరిలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయినా పట్టించుకోవడంలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి అభ్యర్థి రాకేష్ రెడ్డి మంచి విద్యావంతుడు అని, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాకేష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News