సూర్యాపేట: కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితికి తెలంగాణ చేరుకుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీశ్ రెడ్డి చురకలంటించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి, మిరప తోటలను రైతులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందని దుయ్యబట్టారు. ఎండిపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మిరప రైతులకు రూ.80 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని, గత కెసిఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చామని, కక్షపూరితంగా ప్రాజెక్టుల నుంచి రైతులకు నీళ్లు వదలలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
- Advertisement -