నల్లగొండ: సిఎం కెసిఆర్ బహిరంగ సభను అడ్డుకోవాలని కొంత మంది ప్రయత్నించారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సిఎం సభకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గ ఉప ఎన్నిక సందర్భంగా జగదీష్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జానా రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సాగర్ ప్రజలు జానారెడ్డిని 2018లోనే తిరస్కరించారన్నారు. సిఎం కెసిఆర్ సభకు ఆటంకాలు కలిగించేందుకు కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేసిందని, అధికారులు, ప్రజలను జానారెడ్డి భయపెట్టారని ఆయనపై జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం చేయొద్దని జానారెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యవర్గంతో పాటు చోటా మోటా నాయకులంతా నాగార్జున సాగర్‌లో ప్రచారం చేస్తున్నారని విరుచుకపడ్డారు. తాను పదవులు ఎప్పుడూ కోరుకోలేదని, తానే వచ్చాయని జానారెడ్డి అంటున్నారని, 75 ఏళ్ల వయసులో ఇంకా జానాకు పదవులెందుకని, 30 ఏళ్ల యువకుడితో పోటీ ఎందుకని అడిగారు. నాగార్జున సాగర్‌కు 35 ఏళ్లుగా జానా చేసిందేమీ లేదన్నారు.