Monday, December 23, 2024

విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadeesh reddy comments on AP govt

సూర్యాపేట: విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్రం వైఖరి ముమ్మాటికి మోసపూరితమేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలపై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించిన వెంటనే ఆ లీకేజీలు ఇస్తుందని, సంస్కరణలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కేంద్రానికి ఎప్పుడో లేఖ రాశారని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలను మళ్ళీ పెడతామంటూ బిజెపి నేతలు అంటున్నారని, విద్యుత్ సంస్కరణల అంశంలోనూ కేంద్రం అదే వైఖరితో ముందుకు  వెళ్తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కరణలలో మార్పులు తమ దృష్టికి రాలేదని, వచ్చాక పరిశీలించి ప్రజల గొంతుకకు అనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.  విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటిదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News