Sunday, December 22, 2024

మోడీకి రేవంత్ డబ్బుల మూటలు పంపిస్తున్నారు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. సిఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీసుర బాధాకరమని, రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని, బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పాలనలో కరువు వచ్చిందని దుయ్యబట్టారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పిఎం మోడీకి డబ్బుల మూటలు పంపిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తన సిఎం పీఠాన్ని కాపాడుతారని రేవంత్ కలలు కంటున్నారని, రేవంత్‌ను కోమటిరెడ్డి బ్రదర్స్ పొగుడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని జగదీష్ రెడ్డి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News