హైదరాబాద్: సభను ఆర్డర్‌లో పెడితేనే తాను మాట్లాడుతానని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి తెలిపారు. స్పీకర్ అధికారం గురించి మాట్లాడాలనుకున్నానని పేర్కొన్నారు. సభ సంప్రదాయాలు తేలడంతో పాటు స్పీకర్ అధికారులు తేలాలన్నారు. సభ్యుల హక్కులు తేలాలి, అన్నీ తేలాకే తాను మాట్లాడుతానని వివరణ ఇచ్చారు. శాసన సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు.’ఈ సభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, మా అందరి తరపున పెద్దమనిషిగా స్పీకర్‌గా మీరు కూర్చొన్నారు, ఈ సభ మీ సొంతం కాదు’ అని జగదీశ్ రెడ్డి చురకలంటించారు. తన విషయంలో సభా సంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్ మాట్లాడారనడం మంచిది కాదు అని హితువు పలికారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పాలని నిలదీశారు. స్పీకర్‌ను ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధం కాదని ధ్వజమెత్తారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నేను ఏం మాట్లాడానో చెప్పాలి: జగదీశ్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -