Wednesday, December 25, 2024

సభలో విద్యుత్తు అంశంపై కోమటిరెడ్డి, జగదీశ్ రెడ్డి మాటల యుద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు విద్యుత్ అంశంపై వాడీవేడి చర్చలు జరిగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి , ప్రస్తుత బిఆర్ఎస్ ఎంఎల్ఏ జగదీశ్వర్ రెడ్డి విద్యుత్తు అంశంపై వాదోపవాదాలు చేసుకున్నారు. ‘ అనేక కేసుల్లో నిందితుడైన జగదీశ్ రెడ్డిని ఏడాది పాటు నల్గొండ నుంచి బహిష్కరించాలి’’ అని కోమటిరెడ్డి అనగా, ‘‘ కోమటి రెడ్డి అభియోగాల్లో ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసి పోతానని’’ జగదీశ్వర్ రెడ్డి జవాబిచ్చారు.  ‘‘ఒకవేళ ఆరోపణలను నిరూపించలేకపోతే కోమటి రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి’’ అని సవాల్ విసిరారు.

‘‘ నాపైన ఒకటి కాదు…మూడు హత్య కేసులు మోపారు. ఆ కేసుల్లో కోర్టులు నన్ను నిర్దోషిగా తేల్చాయి. వాళ్లు చెప్పిన కేసులపై సభా కమిటీ వేయండి. నేను మాట్లాడితే సిఎం ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మా నాయకుడు కెసిఆర్ హరిశ్చంద్రుడే. చంద్రబాబు సంచులు మోసి జైలుకు వెళ్లింది సిఎంయే. విద్యుత్ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’’ అని జగదీశ్వర్ రెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఇదిలావుండగా విద్యుత్ పైనే కాక సింగరేణి సమస్యలపై కూడా మాట్లాడాలని సిపిఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివ రావు అన్నారు. సింగరేణిని, కార్మికులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

Komatireddy

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News