Saturday, November 23, 2024

బర్త్ డే… మొక్కలు నాటిన జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadeesh Reddy plant trees in Green India challenge

హైదరాబాద్: సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మంత్రుల నివాస సముదాయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు.  నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ భవన్ లో జగదీష్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమని ఇది పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ప్రశంసించారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. గత 3 సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరుగుతుందని భవిష్యత్తులో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.  తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోర్ కుమార్, రవీందర్ నాయక్, ఫైళ్ళ శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, బోల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, చిలమర్తి లింగయ్య, పార్టీ కార్యాలయం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News