మన తెలంగాణ/ సూర్యాపేట: ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సత్యసాయి ధ్యాన మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలపెట్టిన యోగా శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భూమండలంలో అన్నీ జీవులు ప్రకృతి పరిరక్షణకు తాపత్రయ పడుతున్నాడు.
Also Read: నదిలో మొసలితో పోరాడి భర్తను కాపాడిన భార్య
మానవుడు మాత్రం ప్రకృతిపై అన్ని వైపులా దాడులు చేసి తనకు తాను అంతరించే పరిస్థితులు ఉత్పనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా సృష్టిలో ఏ జీవికి లేని అహం మనిషిని అవరించిందన్నారు. అన్నీ తమకే తెలుసంటూ అహ తో విర్రవీగే మానవుడు చివరికి దారి తప్పి ఆత్మహత్య లకు ప్లాడుతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆత్మహత్య లు కూడ ఒక్క మానవ జీవితానికే అవరించడం బాధకరమైన విషయమన్నారు. అటువంటి విపత్కర పరిస్థితుల నుండి బయట పడాలని సూచించారు.