Wednesday, January 22, 2025

‘మోటర్లకు మీటర్లు పెట్టడానికి కెసిఆర్ ఒప్పుకోలేదు… రేవంత్ పక్కదారి పట్టిస్తున్నారు’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా పాలకపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకు జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 1196 కిలో వాట్లు ఉందని, 2024లో రాష్ట్రంలో వ్యక్తిగత వినియోగం 2349 కిలో వాట్లకు పెరిగిందని ప్రశంసించారు. వినియోగం ఆధారంగానే విభజన సమయంలో తెలంగాణకు విద్యుత్‌ను కేటాయించారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందని, 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చామని, నవంబర్ నెల నుంచి 24 కరెంట్ ఇస్తున్నామని, రైతులకు ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంలేదని మంత్రిగా తానే ప్రశ్నించానన్నారు.

విద్యుత్ ఉన్నప్పటికి సరఫరాకు సరిపడా లైన్లు, సౌకర్యాలు లేవని అధికారులు తెలిపారని, రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ పై చర్చించడానికి అవసరమైతే పది రోజులు అదనంగా శాసన సభ నడుపుదామని సవాల్ విసిరారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒప్పుకోలేదని, అవసరమైతే కేంద్రం ఇచ్చే రూ.30 వేల కోట్లను కూడా వదులుకున్నామని వివరించారు. ఇప్పుడు విద్యుత్ మీటర్ల అంశంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించారని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మోడీ, కెసిఆర్ ఉదయ్ స్కీమ్ గురించే ప్రజలు మాట్లాడుకున్నారని, 2014 ముందు మాత్రమే కరెంట్లు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరిగిందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News