Monday, December 23, 2024

మునుగోడులో పర్యటించిన జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadeesh reddy tour in Munugodu

మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి, చండూరులలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం ఖుదాబక్షపల్లి గ్రామంలో కళ్యాణాలక్షి, షాధిముబారక్ చెక్ లను పంపిణీ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డికి ఖుదాబక్షపల్లి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంఎల్ఎ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంఛార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున గులాబీసేన తరలి వచ్చింది.  ఖుదాబక్షపల్లి గ్రామ శివారులో మంత్రి జగదీష్ రెడ్డికి పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో టిఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి. టిఆర్ఎస్ శ్రేణులు శాలువాతో మంత్రి జగదీష్ రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక జడ్ పిటిసి, ఎంపిపి, ఎంపిటిసి, సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News