తెలంగాణా విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి మధ్య వాడివేడిగా వాగ్యుద్ధం జరిగింది. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి 10 వేల కోట్లు తిన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. టెండర్లు పెట్టకుండా కాంట్రాక్టు అప్పగించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందన్నారు. విద్యుత్ రంగంలో నష్టాలకు ఈ కుంభకోణమే కారణమని కోమటిరెడ్డి తప్పుపట్టారు.
మంత్రి ఆరోపణలకు జగదీశ్ రెడ్డి ప్రతిస్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. తమ పాలనలో నాణ్యమైన విద్యుత్ ను అందించామన్నారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందనడాన్ని ఆయన కొట్టి పారేశారు. తమ హయాంలో ఒక్క రోజు కూడా పవర్ హాలీడే ఇవ్వలేదనీ, అర ఎకరం కూడా ఎండిన దాఖలాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అన్నారు.