Thursday, January 23, 2025

హైదరాబాద్ లో దారుణం.. తల్లితో సహజీవనం చేస్తూ..కూతురిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. ఆమె కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని జగద్గీరిగుట్టలో సదురు బాధితురాలి తల్లి.. చంద్రశేఖర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

ఆమె తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. తన ముగ్గురు పిల్లలు కూడా భర్త వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు చంద్రశేఖర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇటీవల తల్లి వద్దకు వచ్చి వెళ్తున్న కూతురిపై కన్నేసిన అతను.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News