Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ సంకల్పం గొప్పది

- Advertisement -
- Advertisement -

అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి మా ఆశీస్సులు

వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది సాధు సంతులను ఆదరించే
విషయంలో ‘కెసిఆర్ కలియుగ జనకుడు’ జగద్గురు పంచాచార్య స్వామీజీల అభిభాషణం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైందని జగద్గురు పంచాచార్య స్వామీజీలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వీరశైవ పంచపీఠంలోని కాశీ, ఉజ్జయినీ, శ్రీశైల పీఠాల జగద్గురువులను సిఎం కెసిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. చంద్రశేఖర శివాచార్య మహాస్వామి(కాశీ), సిద్దలింగ శివాచార్య మహాస్వామీజీ (ఉజ్జయినీ) చెన్నసిద్ధరమా పండితారాధ్య శివాచార్య మహాస్వామిలు శనివారం ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

వారితో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు శివాచా ర్య మహాస్వామీలు హాజరయ్యారు. ఈ సందర్భం గా జరిగిన సమావేశంలో సిఎం కెసిఆర్ శోభమ్మ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగద్గురువులు పలు పుణ్య వచనాలు పలికారు. తెలంగా ణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పదేండ్ల అ నతికాలంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తు న్న సేవ గొప్పదని పేర్కొన్నారు. రైతుకు సాగునీటిని అందించడం గొప్ప విషయమని వ్యాఖ్యానిచారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచి, రైతులను కాపాడుతున్న సిఎం కెసిఆర్ పాలన ఆదర్శవంతమైందని తెలిపారు.

సిఎం కెసిఆర్ సంకల్పం గొప్పది: జగద్గురువులు
“అబ్ కి బార్ కిసాన్ సర్కార్‌” అనే నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న సిఎం కెసిఆర్ సంకల్పం గొప్పది” అని జగద్గురువులు అన్నారు. భారత దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే దిశగా సిఎం కెసిఆర్ తలపెట్టిన నయా భారత్ నిర్మాణంలో తమ సహకారం ఆశీర్వాదాలు అన్ని సందర్భాల్లోనూ వుంటాయని స్పష్టం చేశారు. సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సాదు పుంగవులను ఆదరించడం గొప్ప విషయమని, అందుకు సిఎం కెసిఆర్ అభినందనీయుడని ఈ సందర్భంగా జగద్గురువులు అభినందించారు. వేలాదిమంది సాదువులను ఏక కాలంలో ఆహ్వానించి వారిని గౌరవించడం ఆనాడు జనకమహారాజుకే సాధ్యమైందని అన్నారు. తిరిగి నేడు వర్తమాన భారత దేశంలో తెలంగాణలో సిఎం కెసిఆర్‌కే సాధ్యమైందని పేర్కొన్నారు. సాధు సంతులను ఆదరించే విషయంలో ‘కెసిఆర్ కలియుగ జనకుడు’ అని వారు కొనియాడారు.ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రం అవతరించి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో జరుగుతున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడానికి జగద్గురువులు స్వయంగా రావడం తెలంగాణ ప్రజలందరి భాగ్యం అని అన్నారు.

కేంద్రం నిర్లక్ష్యం వల్ల దేశ వ్యవసాయ రంగం నష్టపోయింది: సిఎం కెసిఆర్
దేశంలో నీరు విద్యుత్తు వంటి సహజ వనరులు పుష్కలంగా లభ్యమవుతున్నాయని, అయినా 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశ వ్యవసాయ రంగం ఎంతో నష్టపోయిందని అన్నారు. వ్యవసాయానికి సాగునీరు లేక విద్యుత్తు లేక రైతాంగం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతు సంక్షేమ పాలన ఈ దేశానికి ఎంతో అవసరమున్నదని, నయా భారత్ నిర్మాణం కోసం జగద్గురువుల సంపూర్ణ సహకారం, ఆశీర్వాదం కావాలని సిం తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన వేదపండితులు, ఆచార్యులు సిఎం కెసిఆర్ దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి, ఫల ప్రసాదాలను అందచేశారు. పంచాచార్య స్వామీజీలను సాంప్రదాయపద్దతిలో సిఎం కెసిఆర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News