Monday, November 18, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లా సిఎం కెసిఆర్ వెంటే: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadish Reddy Comments on Nalgonda MLC Result

నల్లగొండ: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎంసి కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే నడుస్తుందని మరోసారి స్పష్టం అయ్యిందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసబ్యులకు, శాసన మండలి సబ్యులకు టిఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విదంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా టిఆర్ఎస్ ను బలపరిచినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టిఆర్ఎస్ కు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని ఆయన చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతమైన శక్తిగా రూపొందిందని మంత్రి పేర్కొన్నారు.

Jagadish Reddy Comments on Nalgonda MLC Result

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News