Saturday, November 23, 2024

మోడీ పాలనలో అభివృద్ధి జరగదు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadish Reddy fires on BJP and Congress

సూర్యాపేట: నరేంద్ర మోడీ ఎలుబడిలో సంక్షేమం ఉండదు…అభివృద్ధి జరుగదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని, రాష్ట్రంలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముందస్తూ అంటూ మాజీ పీసీసీ కలలు కంటున్నారని.. ఆ కలలు అన్ని పగటి కలలుగా ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలో మహిళా, శిశు, దివ్వాంగులు, వయో వృద్ధుల శాఖా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్క్యూటిలు, ట్రై సైకిల్లు, లాప్ టాప్ లతో పాటు 4జి ఫోన్ లను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. దివ్వాంగులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలోనే వికలాంగులను గుర్తించింది సిఎం కేసీఆర్ అని ఆయన తెలిపారు. అందుకే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన సిఎం కేసీఆర్ వారికి 1500 రూపాయల ఫించన్ అందించారన్నారు. రెండో మారు అధికారంలోకి రాగానే వారి ఫించన్ ను రూ.3000లకు పెంచిన ఘనత ముమ్మాటికీ సిఎంకే దక్కుతుందన్నారు. దివ్వాంగులు అడగక పోయినా వారి జీవితాల్లో వెలుగులు నింపే పద్దతిలో వారికి ఆసరాగా ఉండాలి అన్నదే సిఎం సంకల్పం అన్నారు.

అంగ వైకాల్యతను అధిగమించి మిగితా వారితో పోటీగా అన్ని రంగాలలో వారిని పోటీ పడేలా మానసికంగా సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు.అటువంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఉందా అని ఆయన కాంగ్రెస్, బిజెపిలను సూటిగా ప్రశ్నించారు. ప్రధానికి ముందు ఏకధాటిగా 25 ఏండ్లు బిజెపి ఎలుబడిలో ఉన్న గుజరాత్ లో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలులో లేవన్నారు. మోడీ ఎలుబడిలో సంక్షేమం ఉండదు…అభివృద్ధి జరుగదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటూ జరిగితే ఒకరిద్దరు దళారులకు మాత్రమే ఆ ఫలితం దక్కిందన్నారు. సిఎం కేసీఆర్ విజన్ కు బిజెపి 100 మైళ్ళ దూరంలో ఉందన్నారు. 25 ఏండ్ల పాలనలో గుజరాత్ లో ఇంటింటికి మంచినీరు అందించలేని వారు ఇక దేశాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని ఆయన నిలదీశారు. అభివృద్ధి మీద చర్చకు బిజెపి సిద్ధం అనుకుంటే అది ఢిల్లీ అయినా, గాంధీ నగర కైనా తమ పార్టీ కార్యకర్తలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్, రైతుభీమా, రైతుబంధు వంటి పథకాలు దేశంలోని కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.

Jagadish Reddy fires on BJP and Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News