Thursday, January 23, 2025

రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్: జగదీష్ రెడ్డి

- Advertisement -
హైదరాబాద్: రెండు సార్లూ ఏఐసిసి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టాడని.. రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ అని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న(ఆదివారం) ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “రాసిచ్చింది చడవడమే రాహుల్ గాంధీ చేస్తున్న పని. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారు.భాజపాకు బిఆర్ఎస్ రిశ్తేదార్ కాదు.. రాహులే మోడీకి గుత్తేదారు.నాలుగు వేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత?. ఫించన్ ప్ల కార్డులు రాహులు తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా?.
నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదు. గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారు. అందుకే ఆయనను లీడర్ గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుంది. అది కుడా ఆయన ఏ హోదాలో ప్రకటించారు అన్నదే హాస్యాస్పదంగా మారింది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణా లో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గు ఉండాలి. కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసింది. కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మేడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News