హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలను మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు ఏడుపెందుకు విమర్శించారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీనేనని, రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ అవలంభిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ అనుమతితోనే రేవంత్ ఆ వ్యాఖ్యలు చేశారని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Also Read: రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి