Friday, November 22, 2024

సిఎం కెసిఆర్ సంకల్పంతోనే జెండా పండుగ: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadish Reddy Participate In Mass Recital Of National Anthem

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామూహిక జాతీయగీతా లాపనలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపనను పురస్కరించుకుని చౌటుప్పల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… అహింసాయుత మార్గాన్ని ఆయుదంగా మలచుకున్న యోధుడు మహాత్మాగాంధీ అని మంత్రి పేర్కొన్నారు. ఆ ఆయుదం తోటే భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహానుభావుడు జాతిపిత అని ఆయన కొనియాడారు. అంతే గాకుండా అహింసాయుత మార్గం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాధించ వచ్చు అని ప్రపంచానికే సరికొత్త సిద్ధాంతాన్ని అందించిన స్ఫూర్తిదాత మహాత్మాగాంధీ అన్నారు. అటువంటి స్ఫూర్తితో స్వాతంత్ర్యం సిద్దించకా వచ్చిన మూడో తరానికి స్వాతంత్ర్య సంగ్రామం గురించి తెలియజెప్పాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. అందులో భాగమే స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వజ్రోత్సవవేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో బాగంగా మంగళవారం ఉదయం భోనగిరియదాద్రి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలపనలో మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వాతంత్ర్యం సిద్దించకా వచ్చిన మూడో తరానికి స్వాతంత్ర్య సంగ్రామం స్వరూపం, ఆవశ్యకత ను తెలియజెప్పాలి అన్నదే వజ్రోత్సవ వేడుకల లక్ష్యం అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, ఆచారాలను ఏకం చేసి తెచ్చిన స్వాతంత్ర్య ఫలితాలే మనం నేడు అనుభవిస్తున్నామన్నారు. బారిస్టార్ విద్య కోసం దక్షిణ ఆఫ్రికా చేరుకున్న మహాత్మాగాంధీ స్వాతంత్ర్య సాధనకు గాను భారతదేశానికి తిరిగి వచ్చి అణిచివేత, వివక్ష వంటి పరిణామాల ను అధ్యయనం చేసిన మీదట కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా పర్యటించి స్వాతంత్ర్య ఆవశ్యకత ను వివరించి జాతిని ఏకం చేసిన మీదటనే 780 సంస్థానాలను విలీనం చేస్తూ దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు.

అటువంటి గాంధీ మహాత్ముడిని అగౌరపరిచేలా కొన్ని దుష్ట శక్తులు బయలు దేరాయన్నారు. వాటన్నింటికి చరమ గీతం పాడి వర్తమాననికి స్వాతంత్ర్య సంగ్రామం దాని విశిష్టత అందించాలనే బృహత్తర ఆలోచన తోటే వజ్రోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చుట్టారని మంత్రి పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో భోనగిరియదాద్రి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడుబడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,శానంపూడి సైదిరెడ్డి,నోముల భగత్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు మునుగోడు నియోజకవర్గ టి ఆర్ యస్ ఇంచార్జ్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజేందర్,భోనగిరియదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, స్థానిక మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News