మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు బిఆర్‌ఎస్ అధిష్టానం నుంచి బుధవారం పిలుపు వచ్చింది. గురువారం జరిగే అమరవీరుల స్మృతివనం ఆవిష్కరణలో పాల్గొనాలని పార్టీ ఆమెను కోరినట్లు సమాచారం. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి శంకరమ్మకు ఫోన్ చేసినట్లు తెలిసింది. గురువారం మంత్రి జగదీశ్ రెడ్డి ఆమెను వెంట తీసుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి తీసుకు వెళ్ళనున్నట్లు సమాచారం.
మంత్రి కెటిఆర్ హామీ మేరకు శంకరమ్మకు ఎంఎల్‌సి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఆమెకు ఎంఎల్‌సి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే శంకరమ్మను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని సమాచారం. కాగా, గురువారం(జూన్ 22) సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్‌బండ్‌పై నిర్మించిన అమరవీరుల స్మారక చిహాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.