Monday, December 23, 2024

బిఆర్ఎస్, కెసిఆర్‌ను లొంగదీసుకునేందుకే కవిత అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లొంగదీసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇస్తారని ఆరోపించారు. బిజెపిలో ప్రతిపక్ష పార్టీ నేతలు చేరగానో నోటీసులు ఎత్తేస్తారన్నారు. బిఆర్ఎస్, కెసిఆర్ ను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన తెలిపారు.

దేశంలో బిజెపిని కెసిఆర్ దీటుగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. బిజెపిని ఎదుర్కొన్న వారిపై దుర్మార్గాలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే దుర్మార్గపు చర్యలకు దిగుతున్నారన్నారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధికి బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. సాక్ష్యాలు లేవన్న వాళ్లు ఇప్పడు నిందితురాలని అరెస్టు చేశారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే దుర్మార్గపు చర్యలన్నారు. కవిత తప్పకుండా నిర్దోషిగా తిరిగి వస్తారని జగదీశ్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News