Wednesday, January 29, 2025

రైతులకు నిరంతర విద్యుత్ ఎందుకు ఉండొద్దు?: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ ఉన్నప్పుడు.. రైతులకు ఎందుకు ఉండొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ విషయంలో అధికార పార్టీ బిఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ నాయకుల ఎదురుదాడి చేస్తుండడంతో మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. “కాంగ్రెస్ మనసులో ఉన్న విషయాన్ని తొందరపాటుతో బయటపెట్టారు. మీ ఇంట్లో 24 గంటలు అవసరమైనప్పుడు.. రైతులకు ఎందుకు ఉండొద్దు?. మూడు గంటలే ఇస్తామంటే.. రోజంతా రైతు ఆ సమయం కోసం ఎదురుచూడాలా?. గతంలో కరెంట్ కోసం రాత్రి వేళ పొలాలకు వెళ్లి ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు. గతంలో రేవంత్ రెడ్డి టిడిపిలో ఉండి విద్యుత్ కోసం ధర్నాలు చేయలేదా?. కాంగ్రెస్ పార్టీ.. ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిందా?” అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News