Wednesday, January 22, 2025

పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిలపై సమీక్షా..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిలపై భోనగిరి యాదాద్రి కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సరీల పెంపకంపై రూపొందించిన ప్రణాళికలను అధికారులు వివరించారు. నర్సరీల పెంపకంతో పాటు మొక్కల పెంపకం లక్ష్యాలను చేరుకునేలా చర్యలు ఉండాలంటూ అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. అలాగే, పట్టణ ప్రకృతి వనాల వివరాలను మంత్రి జగదీష్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వరలో నిర్వహించబోయే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సూచనలు చేశారు.

Jagadish Reddy review on Palle Pragathi in Yadadri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News