Monday, January 27, 2025

ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసింది: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్(నందికొండ మున్సిపాలిటీ)లో కోతులు మరణించిన వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్ లతో కలిసి జగదీష్ రెడ్డి పరిశీలించడం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోతులు చనిపోయిన వాటర్ టాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో 2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. కెసిఆర్ హయాంలో పచ్చటి పంట పొలాలతో కళకళలాడిన తెలంగాణ.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చి పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ప్రజలను, పాలనను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీశ్ రెడ్డి ఫైరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News