Monday, December 23, 2024

కెసిఆర్‌పై బురద చల్లుతున్నారు: జగదీష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు 
ఆ ఒప్పందం లేకపోయి ఉంటే విద్యుత్ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది
మళ్లీ ఆంధ్రలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయి
కెసిఆర్‌ను అరెస్టు చేయాలని బిజెపి ఆరాట పడుతున్నది: బిఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: గత ప్రభుత్వం పై నిందలు వేయడానికి, మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌పై బురద జల్లాలన్న స్వా ర్థ రాజకీయంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్లను ఏర్పాటు చేసిందని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జి .జగదీష్‌రెడ్డి ఆరోపించారు. నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూ డా నష్టం జరగలేదని అర్థమైందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్‌తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్, బిజెపి నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారని మండిపడ్డారు. ఈ విషయంలో ఏమీ తే ల్చలేమని చెప్పి ప్రభుత్వం దొంగల్లాగా లీకులు ఇచ్చిందని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తే దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టిందని పేర్కొన్నారు.

కెసిఆర్ తన లేఖలో అ న్ని అంశాలను స్పష్టంగా వివరించారని, ప్రజలకు అ న్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయని తెలిపారు. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదు అని అభిప్రాయపడ్డారు. తె లంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా స మావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చే శారు. సర్కార్ లీకులను సమర్థించేలా ఇప్పుడు కొందరితో మాట్లాడించారని ఆక్షేపించారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరిగిందని అన్నారు. ఆ ఒప్పం దం లేకపోయి ఉంటే విద్యుత్ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఉత్తర భారతం నుంచి కరెంటు తీసుకోకుండా కెసిఆర్ ఫెయిల్ అయితే మళ్లీ సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వారి కుట్ర అని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో అవినీతి జరిగి ఉంటే అప్పటి సిఎం రమణ్ సింగ్, కాంగ్రెస్ సిఎంలు డబ్బులు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో విద్యు త్ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పు తో కొడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దద్దమ్మ నేతలు గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం బంద్ చేయిస్తామన్న కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి రోషం ఉంటే ప్రారంభోత్సవానికి పోకూడదని సవాల్ విసిరారు.

కెసిఆర్‌ను అరెస్ట్ చేయాలనేదే బిజెపి తొందర
ప్రొఫెసర్ కోదండరాం దొంగలతో చేతులు కలిపి తన ఈర్ష్యను చాటుకుంటున్నారని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఎంఎల్‌సి పదవి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివితక్కువ తనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కెసిఆర్‌ను అరెస్ట్ చేయాలని బిజెపికి తొందర ఉన్నట్లుందన్నారు. కాంగ్రెస్, బిజెపి ఒక్కటే అని, ఈ రాష్ట్రంలో వారిరువురు కలిసే కెసిఆర్‌పై కు ట్రలు చేస్తున్నారని, గత ఐదేళ్లుగా తాము చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి వేరు కాదు అని, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పని చేస్తున్నారని చెప్పారు.

జడ్జిని మార్చమనే హక్కు నిందితుడికి ఉంటుందని, ఆ విషయం బండి సంజయ్ ఎలా మర్చిపోయారని నిలదీశారు. విచారించే కమిషన్ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదు అని, ఆ విషయాన్ని కమిషన్ ముందే బయటపెట్టిందని- జగదీశ్ రెడ్డి అన్నా రు. నాడు ఛత్తీస్‌గడ్ నుంచి రూ.3.90కి యూనిట్ వి ద్యుత్ కొనకముందు జజ్జర్ నుంచి రూ. 17కు యూని ట్ విద్యుత్ కొనుగోలు చేసే వాళ్లమని చెప్పారు. ఈ విషయంపై కోదండరాం సూటిగా సమాధానం చెప్పాలని, డొంక తిరుగుడుగా మాట్లాడరాదని పేర్కొన్నారు.

చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసింది రూ. 7వేల కోట్లతో అయితే అందులో రూ. 6వేల కోట్లు వెనకేసుకున్నరు అని అంటున్నారని, ఇదెలా సాధ్యమవుతుంద న్నారు. చత్తీస్‌గఢ్ పవర్ ఇవ్వనప్పుడు బయట నుంచి అధిక ధరకు కొన్నారని అంటున్నారని, అప్పుడు 17వే ల మిలియన్ యూనిట్లకు రూ. 7వేల కోట్లు మాత్రమే ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ను అంధకారంలో తీసుకెళ్లి సమైక్యాంధ్ర పాలననే బా గుంది అనెట్టు చేయాలని చూస్తుందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News