Monday, December 23, 2024

చేనేత కార్మికుల కుటుంబాలలో సిఎం కెసిఆర్ వెలుగులు నింపారు

- Advertisement -
- Advertisement -

భోనగిరి యాదాద్రి:  చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లి లో జరుగుతున్న వారోత్సవాలలో రాష్ట్ర ఐటి, పురపాలక, చేనేత జౌళి శాఖామంత్రి కలువకుంట్ల తారకరామారావుతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..  నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరమగ్గల చప్పుడే కాదు నేతన్నల గుండె చప్పుడు బాగా తెలుసు అన్నారు. నేతన్నల గుండె చప్పుడు తెలిసిన సిఎం కెసిఆర్, ఉద్యమ కాలంలోనే భూదాన్ పోచంపల్లి, సిరిసిల్లలో పర్యటించి చేనేత కార్మికులను ఆదుకున్నారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎటు చూసినా కనిపించేది చేనేత కార్మికులే అయినందున ఈనాడు చేనేతలు ఇంతటి పురోగతి సాదించారన్నారు. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆయన మద్దతుతో కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యూపీఏ 1, 2 ప్రభుత్వాలు చేనేత కార్మికులను వారి ఆత్మాభిమానాలను గుర్తించలేకపోయానని మంత్రి మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News