సూర్యాపేట: సాయుధ రైతాంగ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నైజాం నిరంకుశత్వంపై మొదలైన తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటంగా మారి ఉధృత రూపం దరిస్తున్న సమయంలో ఇది యావత్ భారత దేశానికి వ్యాప్తి చెందుతుందన్న భయంతోటే బ్రిటిష్ పాలకులు దేశం నుండి తోక ముడిచిరాన్నారు. అందుకు దివంగత బీమిరెడ్డి నరసింహా రెడ్డి చేసిన తిరుగుబాటు ప్రధాన కారణంగా నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగా పోరాట నిర్మాత, మార్కిస్టు కమ్యూనిస్టు నేత దివంగత బీమిరెడ్డి నరసింహా రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మంత్రి జగదీష్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నైజాం నిరంకుశత్వపై మొట్టమొదటి సారిగా తిరుగుబావుటా జరిపిన మొట్టమొదటి నేతగా దివంగత బియన్ చరిత్ర సృష్టించారన్నారు. అటువంటి చరిత్రను దిశ దశలు వ్యాపించ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. దోపిడీ పాలన అంతానికి అగ్గి రాజేసిన మహా యోధుడుగా ఆయన కీర్తించబడుతున్నారని ఆయన చెప్పారు.అటువంటి మహానేత స్ఫూర్తి వర్తమాననికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఆయన స్ఫూర్తి ప్రతిబింబించేలా సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో వచ్చే వర్ధంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం ద్వారానే యావత్ భారతదేశంలో ప్రజా చైతన్యం రగిల్చిందన్నారు. ఈ దేశంలో ఒక రోజు బానిస మనస్తత్వంతో వెట్టి చాకిరిలో మగ్గుతున్న కాలంలోనే భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ చుట్టూ ఉన్న వారిని చూసి పరిస్థితులను అధ్యయనం చేసి అసహ్యం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. అటువంటి దోపిడీ పాలన అంతానికి తనకున్న యవాదాస్తిని ఫణంగా పెట్టి ప్రజల కొరకు త్యాగం చేసిన యోధుడు బీమిరెడ్డి నరసింహా రెడ్డి అని ఆయన గుర్తుచేశారు.
పాత సూర్యాపేట తాలూకాతో పాటు తుంగతుర్తి, జనగామ ప్రాంతంలో ఇప్పటికీ బీమిరెడ్డిని కొలుస్తుంటారని ఆయన తెలిపారు.
తనకు జన్మనిచ్చిన అటువంటి ప్రాంతంలో గోదావరి నది జలాలతో సస్యశ్యామలం కావలన్నదే ఆయన తపన అన్నారు. ఆ తపన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాకారం చేశారన్నారు. తాను నిర్మించిన పార్టీలో ఎన్ని కుట్రలు జరిగినా ప్రజల హృదయాలలో ఆయన చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు.
Jagadish Reddy Tribute to B N Reddy