Wednesday, January 22, 2025

జగన్ & కో రూ. 70 వేల కోట్ల ఆస్తులు దోచేశారు: అయ్యన్నపాత్రుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి నేతల భూదాహం ఇంకా తీరడంలేదని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మంగళవారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఇంకెన్ని భూకబ్జాలు చేస్తారోనని ప్రజలు భయపడుతున్నారని, తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఎ2 కుట్ర పన్నుతున్నారని, రూ.300 కోట్ల విలువైనా 120 ఎకరాలను రూ.20 కోట్లకే కట్టబెడతారా? అని ప్రశ్నించారు. ఎకరాలకు ఎకరాలే దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. దేవుడి భూములు కూడా కాజేసే స్థాయికి వచ్చారని, విశాఖపట్నంలో జగన్ & కో 70 వేల కోట్ల ఆస్తులు దోచేశారని ఆరోపణలు చేశారు. టిడిపి ప్రభుత్వం రాగానే సిఎం జగన్ దోపిడీని బయటకు తీస్తామని హెచ్చరించారు.

Also Read: 4 నెలలు ఉల్లి తినకపోతే ఏమీ కాదు: మహారాష్ట్ర మంత్రి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News