Wednesday, February 12, 2025

బాబు వంచన, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోందని వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  తెలిపారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తాడేపల్లి సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు.  సిఎం చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజల్లో మరింత ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామిల్లో ఏవీ నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకీ తీవ్రమవుతోందని జగన్ తెలియజేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శలు గుప్పించారు. అందుకే ఏవేవో సాకులు చెబుతూ…అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు వంచన, దారుణ మోసాలను.. మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అందుకోసం రోజూ ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మరింత మమేకం కావాలని జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంఎల్ఎలు, ఎంపిలు, జడ్పిటిసిలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, వైసిపి నేతలు, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News