అమరావతి: చరిత్రలో ఎప్పడూ చూడని విధంగా వైఎస్ఆర్ పి పాలన చేసిందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. 20019- 2024 మధ్య 1.0 ప్రభుత్వం నడిచిందని ఆయన తెలియజేశారు. లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు డిబిటి చేశామని స్పష్టం చేశారు. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశామని, ప్రజా జీవితాల్లో వెలుగులు నింపామని చెప్పారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశామని, మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని, మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు మన హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్నీ రద్దు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసం అని జగన్ దుయ్యబట్టారు.
బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారు: జగన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -