Friday, February 21, 2025

మిర్చి రైతులు తమ గోడును చెప్పుకున్నారు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ మిర్చి రైతుల సమస్యలపై సమీక్ష కూడా చేయలేదని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి  మండిపడ్డారు. కనీసం మిర్చి రైతుల సమస్యలు కూడా తెలుసుకోలేదని విమర్శలు గుప్పించారు. గుంటూరు మిర్చి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడి వాళ్ల కష్టాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. తమ గోడు మిర్చి రైతులు చెప్పుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం  ఎటువంటి మద్దతు.. రైతులకు అందించలేదని ధ్వజమెత్తారు.

మిర్చి రైతుల అవస్థలు బాబుకు కనిపించడం లేదానని ప్రశ్నించారు. మిర్చి క్వింటాల్ కు కనీసం రూ. 11 వేలు కూడా రావడం లేదని, పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 క్వింటాళ్ల దిగుబడికి 10- 15 క్వింటాళ్లు కూడా రాలేదని చెప్పారు. తమ హయాంలో క్వింటాల్ రూ. 20 వేలు పలికిన మిర్చి ఇప్పుడు రూ.11 వేలు కూడా రావడం లేదని, దీంతో పాటు పంట దిగుబడి కూడా పడిపోయిందని ఆగ్రహించారు. మరోవైపు మద్ధతు ధర లేక మిర్చి రైతుల కష్టాలు పడుతున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News