Sunday, January 5, 2025

చంద్రబాబుకు ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా?: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎన్నికలు ఉన్నప్పుడే చంద్రబాబు ప్రజలు గుర్తుకు వస్తారని ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాను మంచిని నమ్ముకున్నానని, ప్రజలను నమ్ముకున్నానని స్పష్టం చేశారు. పొత్తులు, ఎత్తులు, కుయుక్తులనే చంద్రబాబు నమ్ముకున్నారని, 14 ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ గుర్తుకు రాదన్నారు. చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటు అని, దత్తపుత్రుడు షూటింగ్‌ల విరామంలోనే బయటకు వస్తారని, ఒక్కో ఎన్నికలో ఒక్కో రేటుకు పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ప్యాకేజీ స్టార్ అని మండిపడ్డారు.

Also Read: ఆ ఆటగాళ్లను టీమిండియాలోకి తీసుకోవాల్సిందే….

ఇలాంటి వాళ్లు ప్రజలకు మంచి చెయగలరా? అని జగన్ ప్రశ్నించారు. అధికారంలో ఉంటే అమరావతి… అధికారం లేకపోతే జూబ్లీహిల్స్‌లో ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక్కడ దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని అని చురకలంటించారు. ప్రధానులను, రాష్ట్రపతులను తానే చేశానన్న పెద్ద మనిషి ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని జగన్ సవాలు విసిరారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని, బాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని జగన్ ఎద్దేవా చేశారు. నలుగురు కలిసి లేపితే తప్ప లేవలేని పరిస్థితి తెలుగు దేశం పార్టీ వచ్చిందని చురకలంటించారు. దత్తపుత్రుడిని ఒకేసారి రెండు చోట్ల ఓడించారని, 175 చోట్ల అభ్యర్థులను పెట్టలేని పరిస్థితిలో దత్తపుత్రుడు ఉన్నారని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News