Sunday, February 23, 2025

నరకాసురిడిని నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును నమ్మొద్దు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 98 శాతం హామీలను నెరవేర్చామని, నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, డిబిటి ద్వారా నేరుగా రూ.2.11 లక్షల కోట్లు అందజేశామని, ఇళ్ల స్థలాలతో పాటు 5024 టిడ్కో ఇళ్లు పంపిణీ చేశామని, సిఆర్‌డిఎ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో 5024 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. రూపాయికే అన్ని హక్కులతో టిడ్కో ఇళ్లు అందజేశామని, గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని నిలదీశారు. అమరావతిలో పేదలకు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదని, టిడిపి పాలనలో అన్ని వర్గాలకు మోసమే జరిగిందని, ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారని జగన్ దుయ్యబట్టారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. నరకాసురిడిని అయినా నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబు నాయుడిని నమ్మరాదన్నారు. నవరత్నాలలో ప్రతి హామీని అమలు చేశామని జగన్ తెలియజేశారు. చంద్రబాబు పాలనలో దోచుకో పంచుకో, తినుకో మాదిరిగా ఉందని, ఇంత మంచి జరుగుతుంటే గజదొంగల ముఠా చూడలేకపోతుందని, చంద్రబాబు, ఈనాడు, ఎబిఎన్, టివి5 వీళ్లకు తోడు దత్తపుత్రుడు, వీళ్లంతా దొంగల ముఠా అని జగన్ మండిపడ్డారు. పేదలకు మంచి చేయాలన్న ఆలోచన వీరికి లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News