- Advertisement -
అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ ఇచ్చానన్నారు. షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లిని మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు తను గిఫ్ట్ ఇవ్వలేదని, బహుమతి తన వద్దే ఉందన్నారు. ప్రస్తుతం గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకం పెట్టారని, ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని కోర్టుకు వెళ్లారని ధ్వజమెత్తారు. తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైసిపి వారే ఆలోచించాలని షర్మిల మండిపడ్డారు.
- Advertisement -