Thursday, December 19, 2024

సిఎం జగన్ ప్రచారం జోరు!

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకుంది. రాబోయే సాధారణ ఎన్నికలు ‘నీతిమంతమైన పాలన, మోసపూరిత శక్తులకు మధ్య జరిగే పోరు’గా ఆయన అభివర్ణించారు. ఇది నారా చంద్రబాబుతో జరిగే వ్యక్తిగత పోరు మాత్రం కాదన్నారు. పూతలపట్టులో ఆయన ప్రచారాన్ని కొనసాగించారు.

చంద్రబాబు నాయుడు టిడిపి, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ, పవన్ కళ్యాణ్ జనసేన కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ‘2014లో యుపిఏ కూటమి కూడా ఎన్నికల ప్రచారంలో నేరవేర్చ సాధ్యం కానీ వాగ్దానాలు చేసింది, వారు ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు, ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఒక్కటిగా చేరి ప్రజలను మోసం చేయచూస్తున్నాయి’ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు చెందిన టిడిపిని  ప్రజలు ఓడించి తగిన బుద్ధి చెప్పాలని జగన్ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News