అమరావతి: టిడిఎల్‌పి సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టిడిపి శాసన సభాపక్షం నిర్ణయం తీసుకుంది. టిడిపి ఎంఎల్‌ఎలు అసెంబ్లీకి వస్తే 70 ఎంఎం స్క్రీన్ చూపిస్తామన్న మంత్రుల వ్యాఖ్యలపై కీలక చర్చ జరిగింది. వైసిపికి స్క్రీన్ ప్రంజెంటేషన్ అవకాశం ఇస్తే సిఎం జగన్ అక్రమాస్తులపై స్క్రీన్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పట్టుబట్టాలని టిడిపి ఎంఎల్‌ఎలు నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. శాసన సభలో అవకాశం ఇవ్వకపోతే సిఎం జగన్ అవినీతి బాగోతాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు వెంకటపాలెంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా కాలినడకన అసెంబ్లీకి వెళ్లాలని టిడిపి శాసన సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బిజెపి 16 రాష్ట్రాల్లో సిఎంగా ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు: కాకోలీ ఘోష్