Sunday, December 22, 2024

కేసీఆర్ ను పరామర్శించిన జగన్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గురువారం తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్ ను పరామర్శించారు. తుంటి ఎముక విరగడంతో సర్జరీ చేయించుకుని, బంజారాహిల్స్ లోని తన ఇంట్లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. జగన్ గురువారం ఉదయం కేసీఆర్ ఇంటికి వచ్చి, పరామర్శించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ప్రజలతో మమేకం కావాలని ఆయన కేసీఆర్ ను కోరారు.

ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో గత నెల ఏడో తేదీన కేసీఆర్ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. యశోదా ఆస్పత్రిలో వైద్యులు ఆయన కాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. వారం రోజుల తర్వాత ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన కేసీఆర్ అప్పటినుంచి బంజారాహిల్స్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News