Monday, January 20, 2025

చంద్రబాబుది గజదొంగల ముఠా: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: గుడివాడలో పేదలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క సెంట్ స్థలం, ఇళ్లు కానీ ఇవ్వలేదని సిఎం జగన్ మండిపడ్డారు. గుడివాడలో టిడ్కో గృహ సముదాయాన్ని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మల్లాయపాలెంలో 8912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ప్రతినెలా రూ. 3 వేలు 20 ఏళ్లు కడితేనే టిడ్కో ఇల్లు ఇచ్చారని గుర్తు చేశారు. బాబు ప్రచార ఆర్భాటలకే పరిమితమయ్యారే తప్ప పని చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు టిడ్కో ఇళ్లు నిర్మించలేకపోయారని, రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల సమతౌల్యం దెబ్బతింటుందని చంద్రబాబు కోర్టులకు ఎక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్

14 ఏళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు పేదలకు మేలు చేయలేకపోయారని, ఎన్నికలు సమీపిస్తున్నందున కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని బాబు అంటున్నారని, ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఇంకో అవకాశం ఇస్తే మంచి చేస్తానని బాలు చెబుతున్నారని, టిడిపి పాలనలో చేసిన మంచి పనులు చెప్పి చంద్రబాబు ఓటు అడగాలని జగన్ సవాలు విసిరారు. ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబు తన మేనిపెస్టోను చెత్తబుట్టలో పడేస్తారన్నారు. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ, గజ దొంగల ముఠా అని జగన్ ముండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వాహనాన్ని చూసి మురిసిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి-5, కలిసి గజదొంగల ముఠాగా ఏర్పడ్డాయన్నారు. దోచుకోవడం, పంచుకోవడం, తినడం కోసమే గజదొంగల ముఠాకు అధికారం కావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News