Thursday, November 14, 2024

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతుల మొత్తం బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఆర్‌బికెల ద్వారా మీ బిడ్డ హాయంలోనే రైతులకు మేలు జరుగుతోందని వివరించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా కార్యక్రమంలో మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్రాప్ అనే మాటే లేదని ధ్వజమెత్తారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేశామని, రూ.3,323.21 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని జగన్ మోహన్ రెడ్డి వివరించారు.

Also Read: నల్లగొండలో వివాహితుడితో ప్రేమాయణం… బావిలో యువతి మృతదేహం

రైతులు ఇబ్బంది పడకూడదనే పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రూ.12500కి బదులుగా ఏడాదికి రూ.13500 రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రైతన్న ఇప్పటికే రూ.54 వేలు చొప్పున అందించామని, ఇప్పుడు అందిస్తున్న రైతు భరోసాతో కలిపితే ప్రతి రైతన్న ఖాతాల్లో రూ.61,500 జమ చేస్తున్నామని జగన్ మోహన్ చెప్పారు. ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా రూ.31 వేల కోట్లు జమ చేశామన్నారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామన్నారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లోనే ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. గత నాలుగేళ్లుగా 22.7 లక్షల మంది రైతన్న కుటుంబాలకు రూ.1965 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News