Monday, December 23, 2024

175 సీట్లు సాధించాలి: జగన్

- Advertisement -
- Advertisement -

CM Jagan shocked by bus accident in chittoor

 

అమరావతి: నెలలో 20 రోజుల చొప్పున పది సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో సిఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం ఎనిమిది నెలల పాటు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించాలని సూచించారు. ఇది మన లక్షం అని… ఇది కష్టం కాదన్నారు. ప్రతి సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గడగడపకు నిర్వహించాలన్నారు. మనకు ఓటు వేయనివారికి కూడా రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశామన్నారు. సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని, కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని, ఎపిలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయన్నారు. ప్రతి నెలలో పది సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News