Monday, January 20, 2025

ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడంలేదు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ స్కామ్ సూత్రదారి చంద్రబాబే అని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. గతంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని, సీమెన్స్ కంపెనీకి తమకు సంబంధంలేదని చెప్పారని, స్కిల్ స్కామ్‌లో దొంగలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయని, ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఇడి అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాపు నేస్తం నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం చేసిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు.  డబ్బు ఇవ్వొద్దని అధికారులు చెప్పినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినలేదని, 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లను దారి మళ్లించారని, రూ.371 కోట్ల ఎక్కడికి పోయాయని అడిగారు.

ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. వాటాలు పంచుతాడు కాబట్టే ఎల్లో మీడియా ప్రశ్నించదని, చంద్రబాబు పిఎకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చిందని, ఐటి దర్యాప్తులో చంద్రబాబు పిఎ స్టేట్‌మెంట్ ఇచ్చారని, చంద్రబాబు ఐటి అధికారులు ఆధారాలు చూపి నోటీసులు ఇచ్చారని, సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు బాబును రిమాండ్‌కు పంపిందన్నారు. కోర్టు రిమాండ్‌కు పంపినా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడంలేదని జగన్ దుయ్యబట్టారు. ములాఖత్‌లో మిలాకత్ చేసుకొని పొత్తు పెట్టుకునేవాడు ఒకడని విమర్శలు గుప్పించారు.

లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్త పలుకులు రాసేవాడు మరొకడని మండిపడ్డారు. 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీనే రాజకీయంగా మార్చుకున్నారని, గజదొంగను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నిస్తోందని, అవినీతిపై ఆధారాలున్నా బుకాయిస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా సపోర్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబును కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, వాటాలు ఉండటం వల్లే ఎల్లో మీడియా ప్రశ్నించదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News