Monday, December 23, 2024

బాబు టెంకాయ కొట్టడం తప్ప ఏమీ చేయలేదు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడం, పంచుకోవడం జరిగిందని సిఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. డోన్ సభలో సిఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈనాడు, టివి5, ఎబిఎన్ దత్తపుత్రుడికి వత్తాసు పలుకుతున్నాయని మండిప్డడారు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ముందుక వచ్చానని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల కష్టాలు పట్టించుకోలేదని, ఎన్నికలకు నాలుగు నెలల ముందు బాబు జివొలు జారీ చేయడంతో పాటు శంకుస్థాపనలు చేశారని జగన్ ఎద్దేవా చేశారు. పక్కనే శ్రీశైలం ఉన్నా డోన్, పత్తికొండకు నీరు అందే పరిస్థితి ఎందుకు లేదని ప్రశ్నించారు. లక్కసాగరం ప్రాజెక్టుతో 77 చెరువులకు నీరు అందుతుందని, కర్నూలు, నంద్యాలలో నీటి కష్టాలు తీర్చుతామని, నీటివిలువ, రాయలసీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. గత ప్రభుత్వం టెంకాయ కొట్టడం తప్ప ఏమీ చేయలేదని జగన్ చురకలంటించారు. 2018లో చంద్రబాబు మోసపూరితమైన జివొలు ఇచ్చారని, రాయలసీమ లిఫ్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టును వడివడిగా పనులు పూర్తి చేస్తున్నామని, రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News