Sunday, December 22, 2024

ప్రధాని మోడీకి ఏపి మాజీ సిఎం జగన్ లేఖ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి నాయకుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేడు లేఖ రాశారు. అందులో ఆయన తెలుగు దేశం పార్టీ వర్గీయులు తమ వైఎస్ఆర్ సిపి కేడర్ పై దౌష్టికం చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. నెల రోజుల్లోనే 31 మంది హత్యకు గురయ్యారని, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, గాయపడిన 560 మంది ప్రయివేట్ ఆసుపత్రిలో, 490 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక తమ పార్టీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారని, దాదాపు 2700 మంది భయంతో ఊళ్లు వదిలిపోయారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1050 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని..దీనిని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు.

వైఎస్ఆర్ సిపి ని అణచి వేయడానికి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జగన్ తెలిపారు. వినుకొండలో వైఎస్ఆర్ సిపి కార్యకర్త షేఖ్ రషీద్ హత్యకు గురయ్యాక జగన్ ఈ లేఖను ప్రధానికి రాశారు. అంతేకాదు, జగన్ నేడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. గత 45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనల గురించి వివరించడానికి తనకు కలిసే అవకాశం ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి లేఖలో ప్రధాని మోడీని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News