Friday, November 15, 2024

పేదలకు నాణ్యమైన ఇళ్లు అందించాలి: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవారి సొంతిళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. పేదలకు అత్యంత నాణ్యమైన ఇళ్లను అందించాలని ఆదేశించారు. లే అవుట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. వసతుల ఏర్పాటులో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు.

అధికారులు బదులిస్తూ కోర్టు కేసుల వల్ల 30 వేల మందికి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటివరకు సుమారు 2.75 లక్షల ఇళ్లు పూర్తిచేశామని వెల్లడించారు. స్లాబ్ దశలో 74 వేల గృహాలు, రూఫ్ దశలో 79 వేల గృహాలు ఉన్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే నెలాఖరుకు 5 లక్షల ఇళ్లు పూర్తిచేస్తామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News