Sunday, December 22, 2024

పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

నంద్యాల: గత ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారని, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో నాటకమాడారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడు రాజధానులు కాదు… ఒక్క రాజధాని అయినా కట్టారా? అని చురకలంటించారు. ఐదేళ్లు పరదాలు కట్టుకొని జగన్ తిరిగిరాని విమర్శలు గుప్పించారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కోడికత్తి, గులకరాయి దాడి నాటకాలాడారని, ఇవాళ జనం ముందుకొచ్చి అబద్ధాలు చెబుతున్నారని, జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

మీడియా ప్రశ్నస్తుంటే వారిపైనా కేసులు పెట్టి వేధిస్తారా? అని అడిగారు. ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జివొ నంబర్ వన్ సైకో జగన్ తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. ప్రజావేదికను కూల్చేసి విధ్వంసానికి జగన్ నాంది పలికారని, రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దు చేశారని, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఎక్కడా లేని బ్రాండ్లు జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు దొరక్కుండా చేశారని, భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, నార్సి విధానమంటే ఇదేనని, ఆయన ఒక్కడే బాగుపడాలని, జగన్ దోచేసిన డబ్బుపై తాను పోరాటం చేయడంతో పాటు ప్రజలకు చేర్చుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు అని ప్రశ్నించారు. జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాన్ని చించి తగలబెడుతామని హెచ్చరించారు. రైతుల భూములన్నీ జగన్ కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా?, రైతుల ఆస్తులు కొట్టేసేవాడు కావాలా? ఆస్తులు పెంచేవాడు కావాలో తేల్చుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News